: ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసుపై ఓటింగ్ నేడే!


రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చకు ఈ రోజే ముగింపు కావడంతో ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసుపై ఓటింగ్ జరగబోతోంది. బిల్లును తిరస్కరిస్తూ, దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సిఫార్సు చేయరాదని రాష్ట్రపతికి విన్నవిస్తూ తీర్మానం చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ కు నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో దీనిపై ఓటింగ్ ను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రాంత సభ్యులు, ఆమోదం లభించేలా చూసుకునేందుకు సీమాంధ్ర సభ్యులు శతవిధాల ప్రయత్నించనున్నారు. సభానాయకుడిగా ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసుపై సభ అభిప్రాయాన్ని తీసుకోవాల్సిందేనని బీఏసీ సమావేశంలో స్పీకర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

దీంతో నేటి శాసనసభ సమావేశాలు ఉత్కంఠభరితంగా జరగనున్నాయి. సభలో నెలకొనే వాతావరణానికి అనుగుణంగా భారీ సంఖ్యలో మార్షల్స్ ను ఉపయోగించే అవకాశముంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ను కించపరుస్తూ ఎవరైనా వ్యాఖ్యలు చేసినా, దురుద్దేశాలు అంటగట్టినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరిస్తూ ముఖ్యమంత్రి నిన్న హెచ్చరించిన సంగతి తెలిసిందే. నోటీసుపై మూజువాణి పద్ధతిలో ఓటింగ్ నిర్వహించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News