: నేడు సీమాంధ్ర బంద్: సీమాంధ్ర టీడీపీ నేతల పిలుపు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ రోజు సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు సీమాంధ్ర బంద్ కు పిలుపునిచ్చారు. బిల్లుపై ఓటింగ్ పెట్టేలా ప్రభుత్వంపైనా, స్పీకర్ పైనా, సీమాంధ్ర ప్రజాప్రతినిధులపైనా ఒత్తిడి తీసుకురావడం కోసమే ఈ బంద్ చేపడుతున్నట్టు తెలిపారు. విభజనకు సంబంధించి అత్యంత కీలకమైన పరిణామాలకు, ఈ రోజు జరగనున్న శాసనసభ వేదిక కానున్న నేపథ్యంలో బంద్ లో అన్ని పార్టీలతో పాటు వ్యాపార సంస్థలు, విద్యార్ధులు, ఉద్యోగులు, స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.