: వినూత్నంగా నటిస్తోన్న బాలీవుడ్ సుందరి శిల్పాశెట్టి


ప్రముఖ నటి, పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి వినూత్నంగా ఓ రియాల్టీ షోలో విమానంలో గాలో విహరిస్తూ అభిమానులను అలరించనుంది. స్టార్ ప్లస్ ఛానల్ లో ప్రసారమవుతోన్న ‘నచ్ బలియె 6’ అనే టీవీ షోకి ఆమె న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం శిల్పాశెట్టి రిహార్సల్స్ చేస్తోంది. ఈ కార్యక్రమం శనివారం ప్రసారం కానుంది. ఈ గ్రాండ్ ఫైనల్ కోసం శిల్ప కఠోర సాధన చేస్తోందని, ప్రతి రోజూ రిహార్సల్ చేస్తోందని ఛానల్ వర్గాలు తెలిపాయి.

‘నచ్ బలియె 6’ టీవీ షో మొదట 11 జంటలతో ఆరంభమైంది. ఫైనల్లో ఇప్పుడు నాలుగు జంటలు పోటీపడుతున్నాయి. వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్న శిల్పా శెట్టి టీవీ షోలు, సినిమాలతో పాటు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టింది. భర్తతో కలిసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో శిల్పాకు వాటాలున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News