: శాసనసభ ఎల్లుండికి వాయిదా
బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం శాసనసభలో విపక్షాల ప్రశ్నలకు ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి సమాధానమిచ్చారు. ఇది రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడే బడ్జెట్ అని ఆనం పేర్కొన్నారు. అనంతరం శాసనసభను బుధవారం ఉదయానికి వాయిదా వేస్తున్నట్టు సభాపతి నాదేండ్ల మనోహర్ ప్రకటించారు.