: బీఎస్ఎన్ఎల్ లో ఇక నుంచి ప్రీ పెయిడ్ కి కూడా సీయూజీ సేవలు


దేశంలో ఏ మొబైల్ నెట్ వర్క్ చేయని ప్రయోగాన్ని భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) చేస్తోందని ఆ సంస్థ ఖమ్మం జిల్లా జీఎం హనుమంతరావు చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు మాత్రమే ఉన్న సీయూజీ అవకాశాన్ని ఇక నుంచి ప్రీపెయిడ్ కస్టమర్లకు కూడా అందించనున్నట్లు చెప్పారు. ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉన్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఒక్కో సిమ్ కు 80 రూపాయల చొప్పున నెలకు చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. 25 కంటే ఎక్కువ మంది గ్రూప్ ఉంటే నెలకు 60 రూపాయలకే ఈ ఆఫర్ అందజేస్తున్నామని ఆయన చెప్పారు.

1000 రూపాయలకు పైగా రీచార్జు చేసుకునే వారికి పదిశాతం ఎక్స్‌ట్రా టాక్‌టైంను అందిస్తున్నామని ఆయన అన్నారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో 250 రూపాయలుగా ఉన్న బ్రాండ్‌బాండ్ కనెక్షను వంద రూపాయలకే అందిస్తున్నట్లు జీఎం పేర్కొన్నారు. ఈ అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News