: స్పీకర్ పై కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు: సీఎం
స్పీకర్ నాదెండ్ల మనోహర్ పై కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న స్పీకర్ పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. కీలక అంశాలపై ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వం సహించదని సీఎం స్పష్టం చేశారు.