: స్పీకర్...! సీమాంధ్ర ద్రోహివి కావద్దు: గాలి


స్పీకర్ నాదెండ్ల మనోహర్ సీమాంధ్ర ద్రోహిగా మారకూడదని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 159 మంది ఉన్న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల కంటే 118 మంది ఉన్న తెలంగాణ ప్రజాప్రతినిధుల మాటకే విలువ ఇస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ పై కేంద్రం ఒత్తిడి పని చేస్తోందని ఆరోపించారు.

అవాస్తవాలపై నిర్మితమైన తెలంగాణ వాదిగా స్పీకర్ మారారని గాలి విమర్శించారు. తీర్మానం ప్రవేశపెట్టే హక్కు శాసనసభ్యులకు ఉందని ఆయన అన్నారు. సీఎం సహా అన్ని పార్టీలు బిల్లుపై తీర్మానాలు, నోటీసులు ఇచ్చాయని ఆయన అన్నారు. అయినప్పటికీ స్పీకర్ ఢిల్లీకి తొత్తుగా పని చేస్తున్నాడని మండిపడ్డారు. సీఎం, స్పీకర్ కలిసే నాటకాలు ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News