: షెల్జా రాజీనామా ఆమోదం
కేంద్ర మంత్రి పదవికి కుమారి షెల్జా చేసిన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కుమారి షెల్జాను హర్యానా రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి పదవికి కుమారి షెల్జా రాజీనామా చేశారు. ఇకపై తాను పూర్తి సమయాన్ని పార్టీకి సేవ చేయడానికే వెచ్చిస్తానని కుమారి షెల్జా తెలిపారు.