: 24 గంటల తరువాత బిల్లు రాష్ట్రంలో ఉండదు: గండ్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు మరో 24 గంటల తర్వాత రాష్ట్రంలో ఉండదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి జోస్యం చెప్పారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, బిల్లును ఆపుతామంటూ సీమాంధ్ర నేతలు అక్కడి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. విభజన కారణాలతో ముఖ్యమంత్రి రాజకీయాలనుంచి తప్పుకోరని తాను భావిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి నోటీసు వాపస్ తీసుకునేంత వరకు తెలంగాణ నేతలు నిరసన విరమించరని తాను భావిస్తున్నానన్నారు.