: సమైక్యాంధ్రను కోరుతూ విద్యాసంస్థల జేఏసీ భారీ ర్యాలీ
సమైక్యాంధ్రను కాంక్షిస్తూ బుధవారం గుంటూరు జిల్లా విద్యాసంస్థల జేఏసీ భారీ ర్యాలీని నిర్వహిస్తోంది. సుమారు 500కు పైగా బస్సులతో నరసరావుపేట, చిలకలూరిపేట, తెనాలి, మంగళగిరిలోని వివిధ విద్యాసంస్థల నుంచి విద్యార్థులు బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియానికి చేరుకుని, అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. గుంటూరు నగరంలోని ప్రధాన మార్గాల గుండా సాగుతోన్న ఈ ర్యాలీ సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది. విద్యాసంస్థల జేఏసీ ఛైర్మన్ లావు రత్తయ్యతో పాటు అనేక విద్యా సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.