: అళగిరి వ్యాఖ్యలపై స్టాలిన్ స్పందన
మరో మూడు నెలల్లో స్టాలిన్ చనిపోతాడంటూ డీఎంకె అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అన్న అళగిరి వ్యాఖ్యలపై తాపీగా స్పందించిన స్టాలిన్.. పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు చనిపోతారని చెప్పాడు. అయితే, ఈ మాటల్లో అంతరార్థమేమిటనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. కానీ, తన అన్న దిష్టిబొమ్మలను దహనం చేయవద్దని పార్టీ కార్యకర్తలకు స్టాలిన్ పిలుపునిచ్చారు. పార్టీ క్రమశిక్షణ అన్నింటికంటే ప్రధానమని, తన గురించి అళగిరి చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవట్లేదని ఆయన చెప్పారు.