: రైళ్లు ఢీ కొట్టుకోకుండా ప్రయోగం


ఎదురెదురుగా వస్తున్న రైళ్లు ఢీ కొట్టుకోకుండా టీకాస్ ప్రయోగాన్ని రైల్వే ఎలక్ట్రికల్ బోర్డు సభ్యుడు కుల్ భూషణ్, దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ శ్రీ వాత్సవలు పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా సరిహద్దుల్లో ఉన్న నవాంద్ గీ, మంతట్టి, తాండూరు, కర్ణాటక రాష్ట్రంలోని కురుగుంట రైల్వే స్టేషన్లలో ఈ ప్రయోగాలు చేశారు. సిగ్నల్స్ లేని చోట నాలుగు రైలు ఇంజిన్లను అమర్చి పరీక్షిస్తున్నారు. సిగ్నల్ వ్యవస్థ వద్ద ఎర్ర సిగ్నల్ పడినప్పుడు డ్రైవర్ అప్రమత్తంగా లేకుంటే, ఇంజిన్ లో అమర్చిన ఈ యంత్రం డ్రైవర్ ను అప్రమత్తం చేయడంతోపాటు బ్రేకులు కూడా వాటంతట అవే పడేలా చేస్తుంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే భారత రైల్వేల్లోని అన్ని రైళ్లలో ఈ యంత్రాలను అమర్చుతామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News