: బాలుడి హత్య కేసు నిందితుల అరెస్టు


హైదరాబాద్ శివారులో ఈ ఉదయం జరిగిన బాలుడి దారుణ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. యశ్ రాజ్ కుమార్ ను హత్య చేసిన పీరంచెరువు వద్దకు నిందితులు నలుగుర్ని తీసుకెళ్లారు. వారిలో బాలుడి మేనమామ వరసైన వినోద్ అనే వ్యక్తి బాలుడి తలపై బండరాయితో మోది హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. కాగా, మద్యం మత్తులో హత్య చేశానని చెబుతున్నాడు. బాలుడికోసం వెదుకుతున్న బాలుడి తల్లిదండ్రులకు, బాలుడి మిత్రుడు... 'వినోద్ అంకుల్ తో యశ్ రాజ్ ను చూశా'నని చెప్పడంతో, అతడిని పట్టుకుని ఆరా తీశారు. అయితే యశ్ రాజ్ ను ఎందుకు హత్య చేశాడు, బాలుడి హత్య వెనుక అసలు సూత్రధారులు ఎవరు? అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News