: నిధులెక్కడివో 'ఆప్' చెప్పడం లేదు: కేంద్రం


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తమ పార్టీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పడం లేదని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకి తెలిపింది. ఆప్ కి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియజేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ 'ఆప్'పై కోర్టుకు ఫిర్యాదు చేశారు. పార్టీకి సంబంధించిన నిధుల వివరాలు అడుగుతూ గతేడాది నవంబర్ 4న లేఖ రాసినప్పటికీ ఆ పార్టీ స్పందించలేదని, తరువాత మరో లేఖ రాశామని, దానికి కూడా స్పందన లేదని అదనపు సొలిసిటర్ జనరల్ రాజీవ్ మెహ్రా ఢిల్లీ హైకోర్టుకు వివరించారు.

  • Loading...

More Telugu News