: మహబూబ్ నగర్ జిల్లాలో ట్రాక్టర్ బోల్తా.. 15 మందికి గాయాలు
మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ (బుధవారం) రోడ్డు ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. పెబ్బేరు మండలం తాటిపాముల సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న వారు గాయాల పాలవ్వడంతో వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.