: ఓటింగ్ అడిగే హక్కు అందరికీ ఉంది: పార్థసారధి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ చేయాలని కోరే హక్కు ప్రతి ఒక్క శాసనసభ్యుడికీ ఉందని మంత్రి పార్థసారధి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ బిల్లుపై ఓటింగ్ కోరుతూ 159 మంది ప్రజాప్రతినిధులు స్పీకర్ కు లిఖితపూర్వక లేఖలు ఇచ్చారని తెలిపారు. శాసనసభలో మెజారిటీ సభ్యులు సమైక్య రాష్ట్రాన్నే కోరుతున్నారని ఆయన స్పష్టం చేశారు.