: సల్మాన్ ఖాన్ ఎంఐఎం దయతో హీరో కాలేదు: కిషన్ రెడ్డి


బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలను చూడవద్దన్న ఎంఐఎం నేతలపై భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సల్మాన్ ఎంఐఎం దయతో సినీ హీరో కాలేదని ఆయన అన్నారు. ఇటీవల గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో కలిసి పతంగులు (గాలిపటాలు) ఎగురవేసినందుకు సల్మాన్ ఖాన్ పై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ముస్లింల వ్యతిరేకి అయిన మోడీతో కలిసి గాలిపటాలు ఎగురవేసిన సల్మాన్ సినిమాలు చూడవద్దని ఒవైసీ పిలుపునిచ్చారు. అసదుద్దీన్ పిలుపుపై కిషన్ రెడ్డి మండిపడ్డారు.
ఇదిలా ఉండగా, అసెంబ్లీ జరుగుతున్న పరిణామాలపై కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లుపై సీఎం కిరణ్ నాటకమాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఈ నాటకానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా నిర్మాత అని, దిగ్విజయ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News