: బెదిరింపులకు భయపడేది లేదు.. పోటీలో ఉండి తీరుతాం: కాంగ్రెస్ రెబల్స్
రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్న తిరుగుబాటు అభ్యర్థులను కట్టడి చేసేందుకు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుగుబాటు అభ్యర్థుల నామినేషన్ పత్రాల మీద సంతకాలు చేసిన ఎమ్మెల్యేలను... సంతకాలు వెనక్కి తీసుకోవాలని ఇప్పటికే బొత్స కోరారు. అయితే, తాము మాత్రం బెదిరింపులకు లొంగేది లేదని రెబల్స్ చైతన్యరాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. నామినేషన్లు ఉంసంహరించుకోవాలని తమపై ఒత్తిడి పెరుగుతోందని వారు తెలిపారు. అయితే, తామిద్దరిలో ఎవరో ఒకరు పోటీలో ఉండి తీరుతామని వారు తేల్చి చెప్పారు.