: స్టాలిన్ కు రక్షణ కల్పించాలని పీఎంకు కరుణానిధి లేఖ


చిన్న కుమారుడు స్టాలిన్ కు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రధాని మన్మోహన్ సింగ్ కు డీఎంకే అధినేత కరుణానిధి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఐదు రోజుల కిందట పెద్ద కుమారుడు అళగిరిని పార్టీ పదవుల నుంచి కరుణ తొలగించారు. ఈ నేపథ్యంలో మరో మూడు నెలల్లో స్టాలిన్ చనిపోతాడంటూ అళగిరి తన కార్యాలయానికి వచ్చి చెప్పాడని నిన్న కరుణ బయటపెట్టారు. ఈ మేరకు స్టాలిన్ కు భద్రత పెంచాలని, ఆయన ప్రధానికి లేఖ రాసినట్లు సమాచారం. మరోవైపు డీఎంకేలో చెలరేగిన సంక్షోభం, అన్నదమ్ముల మధ్య విభేదాలు, కరుణ చర్యలు తీసుకోవడంతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏ సమయంలో ఏం జరుగుతుందో అని అందరూ ఉత్కంఠతో చూస్తున్నారు.

  • Loading...

More Telugu News