: రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన
రాష్ట్రం నుంచి ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతోన్న విషయం విదితమే. రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కొనసాగుతోంది. స్వతంత్ర అభ్యర్థి భాస్కర్ నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు చైతన్యరాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డిల నామినేషన్లపై నిర్ణయాన్ని పెండింగ్ లో ఉంచారు. అభిప్రాయం చెప్పేందుకు రిటర్నింగ్ అధికారి వారికి గంట గడువు ఇచ్చారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్లు సక్రమమేనని రాజ్యసభ రిటర్నింగ్ అధికారి సదారాం ప్రకటించారు.