: ‘షరాన్ స్టోన్'తో నాకు పోలికా?: హాలీవుడ్ నటి అబీ కార్నిష్
90వ దశకంలో వచ్చిన హాలీవుడ్ సూపర్ హిట్ ‘బేసిక్ ఇన్ స్టింక్ట్’ సినిమా చూశారా? అందులో అండర్ గార్మెంట్స్ లేకుండా, కాలు మీద కాలేసుకుని కూర్చుని ... విచారణాధికారులను మత్తెక్కించిన షరాన్ స్టోన్, ఆంగ్ల సినిమా ప్రియులకు గుర్తుండే వుంటుంది. ఈ ముద్దుగుమ్మను ఇప్పుడు మరో హాలీవుడ్ నటి అబీ కార్నిష్ పొగడ్తలలో ముంచెత్తుతోంది. షరాన్ అందం, అభినయం ఉన్న నటి అని కీర్తిస్తోంది. విశేషం ఏమిటంటే, ఇటీవలే ఆమెను షరాన్ స్టోన్ తో పత్రికలు పోల్చాయి. అయితే, తన కంటే షరాన్ స్టోన్ చాలా అందంగా ఉంటుందని, ఆమెతో తనకు పోలిక లేదని కార్నిష్ చెప్పింది.
షరాన్ తో పోల్చినందుకు ఎలా అనిపిస్తోందని అడిగితే.. "షరాన్ తో పోలిక అంటే నిజంగా నాకు తెలీదు. అయినా షరాన్ స్టోన్ చాలా అందమైన నటి కాబట్టి, ఆమెతో పోలిస్తే అది నాకు పెద్ద కాంప్లిమెంటే" అని కార్నిష్ చెప్పింది. 31 ఏళ్ల అబీ కార్నిష్ ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమా ‘రోబోకాప్’లో క్లారా మర్ఫీ పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 14 ‘వేలేంటైన్స్ డే’ రోజున భారతదేశంలో విడుదల అవుతోంది.