: అసెంబ్లీ లాబీలో చంద్రబాబును కలిసిన హాస్యనటుడు వేణుమాధవ్


హాస్య నటుడు వేణుమాధవ్ బుధవారం అసెంబ్లీ లాబీలో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలను వేణుమాధవ్ కలిశాడు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయనను పలకరించారు. తాను గతంలో టీడీఎల్పీలో ఉద్యోగిగా పనిచేశానని.. ప్రస్తుతం షూటింగ్ లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ నేతలను కలిసేందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు.

వేణుమాధవ్ చదువుకునే రోజుల్లో మిమిక్రీ చేసేవాడు. అప్పటి కోదాడ ఎమ్మెల్యే చందర్ రావు వెంట్రిలాక్విజమ్ ప్రోగ్రామ్ చేసిన వేణుమాధవ్ ను భువనగిరిలో టీడీపీ సమావేశానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మహానాడులో ఆయన ప్రదర్శన ఇచ్చారు. అది ఎన్టీఆర్ కు నచ్చటంతో ‘మీ సేవలు మాకెంతో అవసరం బ్రదర్’ అంటూ వేణుమాధవ్ ను హిమాయత్ నగర్ టీడీపీ ఆఫీసులో చేర్చుకున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News