: శాసనసభ లాబీలో భావోద్వేగానికి గురయిన మోత్కుపల్లి
రాజ్యసభ సీటు తనకు రాకపోవడంపై టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు శాసనసభ లాబీలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం చూసి అందరూ తనకు రాజ్యసభ సీటు వస్తుందని అనుకున్నారన్నారు. సీటు ఇవ్వలేనని వారం రోజుల ముందే చెబితే ఈ బాధ ఉండేది కాదన్నారు. దాంతో, ఆ పక్కనే ఉన్న ఎర్రబెల్లి మోత్కుపల్లిని సముదాయించారు. అయితే, రెండు సీట్లు సీమాంధ్ర వారికే ఇచ్చినందున కన్వీనర్ పదవికి రాజీనామా చేయాలని ఎర్రబెల్లికి మోత్కుపల్లి సూచించారు.