: ఐపీఎల్-7 నుంచి తప్పుకున్న మైఖేల్ క్లార్క్!
ఈసారి ఐపీఎల్-7 సీజన్ నుంచి ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ తప్పుకున్నాడు. దాంతో, ఫిబ్రవరి 12న జరిగే ఐపీఎల్ వేలంలో అతని పేరును తొలగిస్తున్నారు. పనిభారం ఎక్కువవటం, వచ్చే నెలలో ఆసిస్ జట్టు దక్షిణాఫ్రికా టూర్ వెళ్లనున్న నేపథ్యంలో నాలుగు నెలల పాటు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. దాంతో, జట్టు సహచరుడు ర్యాన్ హారిస్ లా ఈసారి ఐపీఎల్ సీజన్ కు టాటా చెప్పాడు.