: ఇల్లినాయిస్ ఇన్నోవేషన్ వైస్ చైర్మన్ గా కృష్ణమూర్తి
భారతీయ, అమెరికన్ రాజకీయ వేత్త రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్ ఇన్నోవేషన్ మండలి నూతన వైస్ చైర్మన్ గా ఎంపికయ్యారు. ఈ మేరకు అమెరికాలోని ఇల్లినాయిస్ గవర్నర్ పాట్ క్విన్ ఉత్తర్వులు జారీ చేశారు. లాయర్, ఇంజనీర్ అయిన 39 సంవత్సరాల కృష్ణమూర్తి గతంలో ఇల్లినాయిస్ మాజీ డిప్యూటీ ట్రెజరార్ గా పనిచేశారు. అంతేగాక ఇల్లినాయిస్ ప్రత్యేక అసిస్టెంట్ జనరల్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన 'శివనాథన్ ల్యాబొరేటరీస్' కు అధ్యక్షుడిగా ఉన్నారు.