: రాజ్యసభకు మొత్తం 16 సెట్ల నామినేషన్లు
రాజ్యసభ ఎన్నికలకు ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి 16 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రం నుంచి జరిగే ఆరు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలను రాజ్యసభ రిటర్నింగ్ అధికారి సదారాంకు సమర్పించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గరికపాటి మోహనరావు మూడు సెట్లు, తోట సీతారామలక్ష్మి రెండు సెట్ల నామినేషన్లు వేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కె.కేశవరావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కేవీపీ రామచంద్రరావు, తిక్కవరపు సుబ్బరామిరెడ్డి రెండేసి సెట్లు, కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి చైతన్యరాజు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఎం.ఏ ఖాన్, ప్రభాకర్ రెడ్డి, భాస్కర్ ఒక్కో సెట్ నామినేషన్ వేశారు.