: ఇటలీ రాయబారిపై నిర్బంధం లేదు ... కానీ దేశం విడిచి వెళ్ళరాదు: సుప్రీం
నావికాదళ గార్డుల వ్యవహారంలో తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ దేశం విడిచి వెళ్లరాదని భారత్ లో ఇటలీ రాయబారి డానియెల్ మాన్సిని సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశించింది. కోర్టుకు హామీ ఇచ్చి ఉల్లంఘించిన వారికి విశేషాధికారాలు ఉండవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అల్తమాస్ కబీర్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇటలీ రాయబారిపై నిర్బంధం లేదని, దేశంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా పర్యటించవచ్చని పేర్కొంది. దేశం విడిచి వెళ్లాలంటే తమ అనుమతి ఉండాల్సిందేనని ధర్మాసనం పేర్కొంటూ కేసు విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది.
కేరళ తీరంలో జాలర్లను హత్య చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఇటలీ నావికాదళ గార్డులు ఎన్నికలలో పాల్గొనేందుకు సుప్రీం అనుమతితో స్వదేశానికి వెళ్లారు. వారు మళ్లీ తప్పక తిరిగి వస్తారని నాడు సుప్రీంకోర్టుకు ఇటలీ రాయబారి డానియెల్ హామీ ఇచ్చారు. ఇప్పుడు వారిని పంపకూడదని ఇటలీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది.