: బొప్పాయి వుండగా ... బీపీ భయమేల?
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఈవేళ ఎవరిని చూసినా బీపీ (రక్తపోటు) బాధితులే!
ఒకప్పుడు నడివయసులో వచ్చే ఈ రక్తపోటు వ్యాధి, ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా యువకులకు కూడా వచ్చేస్తోంది. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి!
ఇలాంటి బీపీని తగ్గించే శక్తి బొప్పాయి పండుకి వుంది.
ఇందులో పొటాషియం సమృద్ధిగా ఉండడంతో ఇది బీపీని సమర్ధవంతంగా నియంత్రిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఉదయమో, రాత్రో నాలుగు బొప్పాయి ముక్కలు తింటే బీపీ కంట్రోల్ లోకి వచ్చి మనసు ప్రశాంతంగా వుంటుంది.
అంతేకాదు, కంటికి కూడా ఈ పండు మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కంటిచూపు తగ్గుతోందనుకునేవారు రోజూ బొప్పాయిని తీసుకుంటే ఆ సమస్యను ఇట్టే అధిగమించచ్చు.
అలాగే, జీర్ణశక్తిని మెరుగుపరచే లక్షణం కూడా బొప్పాయి సొంతం. మలబద్ధకం (కాన్స్టిపేషన్) సమస్య తీరుతుంది. తక్కువ కేలరీలు .. ఎక్కువ ఫైబర్ (పీచు పదార్ధం) కలిగిన బొప్పాయిని చిన్నచూపు చూడకుండా మన ఆహారంలో భాగంగా చేసుకుందాం!