: ముంబయి-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురి సజీవదహనం
ముంబయి-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై థానే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ ను వోల్వోబస్సు ఢీకొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ముంబయి నుంచి అహ్మదాబాద్ వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.