: ప్రైవేట్ బస్సులు ఎక్కకండి... వాటికి అనుమతిలేదు: ఆర్టీఏ అధికారులు
పలు ప్రైవేట్ బస్సులకు అనుమతి లేదని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రయాణికులంతా ఈ విషయాన్ని గుర్తించాలని ఆర్టీఏ అధికారులు స్పష్టం చేశారు. అలాంటి ప్రైవేటు బస్సులను ఎవరెక్కినా తమకు సంబంధం లేదని, ప్రైవేటు బస్సులు రోడ్డెక్కినట్టు తమ దృష్టికి వస్తే, ఆయా బస్సులను అడ్డుకుని, ప్రయాణికులను దించేసి, బస్సును సీజ్ చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న పలు బస్సులను సీజ్ చేసినట్టు ఆర్టీఏ తెలిపారు.