: స్వతంత్ర అభ్యర్థులకు ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణ
స్వతంత్ర అభ్యర్థులకు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యింది. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చేసిన హెచ్చరికలు ఆ పార్టీ నేతలపై బాగానే పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్, చైతన్యరాజులకు మద్దతు ఇవ్వడం లేదంటూ గతంలో మద్దతిచ్చిన నేతలు రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సదారాంకు లేఖలు ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతివ్వడం లేదంటూ ఎమ్మెల్యేలు నీరజారెడ్డి, విజయ్, శేషు లేఖలు సమర్పించారు. మరో అభ్యర్థి చైతన్యరాజుకు మద్దతు ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యేలు ముత్యాల పాప, మురళీకృష్ణ లేఖలు ఇచ్చారు. అయితే ఈ లేఖలపై స్వతంత్ర అభ్యర్థి ఆదాల ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.