: లైంగిక వేధింపుల కేసులో మాజీ ఎంపీ అరెస్ట్


ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీకి మరో చిక్కు వచ్చి పడింది.  లైంగిక వేధింపుల వ్యవహారంలో ఈ పార్టీకి చెందిన మాజీ పార్లమెంటు సభ్యుడు చంద్రనాథ్ సింగ్ అరెస్టయ్యారు. కొన్ని రోజుల క్రితం పద్మావతి ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు చంద్రనాథ్ సింగ్ తనను లైంగికంగా వేధించబోయారంటూ ఓ బాలిక ఫిర్యాదు చేయడంతో... షాజహాన్ పూర్  ప్రభుత్వ రైల్వే పోలీసులు చంద్రనాథ్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు.

మద్యం సేవించి ఉన్న మాజీ ఎంపీ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సదరు బాలిక పేర్కొంది. అయితే, తాను నిర్ధోషినని మాజీ ఎంపీ చంద్రనాథ్ సింగ్ చెప్పారు. మరోవైపు మాజీ ఎంపీ నిర్వాకంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. 

  • Loading...

More Telugu News