: సీఎం తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణ ఆగదు: పాల్వాయి


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా, నిరాహార దీక్షకు దిగినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని ఎంపీ పాల్వాయి గోవర్థన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని, అసెంబ్లీని అడిగింది కేవలం అభిప్రాయమేనని అన్నారు. తెలంగాణ లాభనష్టాల గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News