: మత ఘర్షణలు, అల్లర్లు, ఊచకోతలకు ఆ రెండు పార్టీలే కారణం: నితీష్ కుమార్


దేశాన్ని తలదించుకునేలా చేసిన పలు మత ఘర్షణలు, అల్లర్లు, ఊచకోతలకు కాంగ్రెస్, బీజేపీలే కారణమని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మండిపడ్డారు. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన సిక్కుల ఊచకోతకు, 1989లో బీహార్ లోని భాగల్పూర్ లో సంభవించిన అల్లర్లకు కారణం అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న కాంగ్రెస్సేనని మండిపడ్డారు. 2002లో గుజరాత్ లో జరిగిన మారణకాండకు బీజేపీ కారణమని విమర్శించారు.

ఇలా దేశం పరువు మంటగలిపిన ప్రతి ఘటనకు కాంగ్రెస్, బీజేపీలే కారణమని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఆ రెండు పార్టీలు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. తనకు తాను లౌకికవాదిగా చెప్పుకునే లాలూప్రసాద్ యాదవ్, అధికారంలోకి రాగానే భాగల్పూరు ఘటనపై దర్యాప్తు ఆపివేయించారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చి, తమపై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News