: పాదయాత్రలో అపశృతి.. కొంపలకు నిప్పంటించిన ఆనందం
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ఎంపీ కుమారుడి పాదయాత్ర సందర్భంగా అత్యుత్సాహంతో కార్యకర్తలు బాణాసంచా పేలుస్తూ సంబరంగా కదిలారు. పేలిన బాణాసంచా నిప్పురవ్వలు అక్కడ ఉన్న పూరిళ్లపై పడడంతో అవి అగ్నికి ఆహుతయ్యాయి. కార్యకర్తల అత్యుత్సాహం కారణంగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.