: రాజ్యసభకు పోటీ చేస్తున్నానని నన్ను బెదిరిస్తున్నారు: ఎమ్మెల్యే ఆదాల
రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు తనను కొందరు మంత్రులు, నేతలు బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. అయితే, తాను ఎవరికీ భయపడనని, పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొంతమంది అధికారులను కూడా బెదిరిస్తున్నారని, తనకు సహకరిస్తున్న ఎమ్మెల్యేలను మద్దతు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని ఆదాల ఆరోపించారు.