: హాట్ హాట్ గా ముగిసిన బీఏసీ సమావేశం


స్పీకర్ అధ్యక్షతన వాడివేడిగా జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. ముసాయిదా బిల్లుపై చర్చ ముగిశాకే తీర్మానం గురించి మాట్లాడాలని, అప్పుడే సభ సజావుగా సాగుతుందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. బిల్లును తిప్పి పంపాలనే నోటీసును ముఖ్యమంత్రి ఉపసంహరించుకుంటే సభ సజావుగా జరిగేందుకు సహకరిస్తామని టీఆర్ఎస్ స్పష్టం చేసింది. మెజారిటీ సభ్యుల నిర్ణయం తెలియాలంటే సభలో తప్పని సరిగా ఓటింగ్ జరగాలని టీడీపీ డిమాండ్ చేసింది. శాసనసభ సజావుగా జరగాలంటే ముఖ్యమంత్రి నోటీసు వెనక్కి తీసుకోవాలని ఎంఐఎం పార్టీ కోరింది.

  • Loading...

More Telugu News