: బీఏసీలోనూ కొనసాగుతున్న వివాదం


బీఏసీ సమావేశంలోనూ ఇరు ప్రాంత నేతల మధ్య వివాదం కొనసాగుతోంది. ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని సీమాంధ్ర నేతలు స్పీకర్ కు సూచించారు. దీనిని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, తెలంగాణ నేతలు, టీఆర్ఎస్ సభ్యులు వ్యతిరేకించారు. సభనాయకుడిగా ముఖ్యమంత్రి నోటీసును పరిగణనలోకి తీసుకోవాలని సీమాంధ్ర నేతలు వాదిస్తుండగా, రాష్ట్రపతి పంపిన బిల్లుకు ఇలాంటి రూల్స్ వర్తించవని తెలంగాణ వారు వాదిస్తున్నారు. ఏది ఏమయినా, వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు.

  • Loading...

More Telugu News