: వాడివేడిగా బీఏసీ సమావేశం
బీఏసీ సమావేశం స్పీకర్ అధ్యక్షతన వాడివేడిగా కొనసాగుతోంది. రాష్ట్రపతి పంపిన బిల్లు తప్పుల తడకగా ఉందని... చర్చకు గడువు పెంచాలని టీడీపీ నేత అశోక్ గజపతిరాజు కోరారు. అయితే, గడువు పెంచాల్సిన అవసరం లేదని టీటీడీపీ నేత రావుల అన్నారు. సీఎం కిరణ్ ఇచ్చిన నోటీసు నిబంధనలకు అనుగుణంగా లేదని... దాన్ని తిరస్కరించాలని టీఆర్ఎస్, ఎంఐఎంలు కోరాయి. ఇప్పటి వరకు బిల్లుపై 87 మంది మాత్రమే మాట్లాడారని... కావున మరింత సమయం కావాలని ఆనం అన్నారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువు లోపలే చర్చను ముగించి, బిల్లును ఢిల్లీకి పంపాలని డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ చెప్పారు.