: అభిమానికి సల్మాన్ బైక్ బహుమానం!
తనకి ఇష్టమైన వారికి, స్నేహితులకు నటుడు సల్మాన్ ఖాన్ అప్పుడప్పుడు బహుమానాలు ఇస్తుంటాడు. అవి కూడా చాలా ఖరీదైనవే ఉంటాయి. తాజాగా తనంటే అపార అభిమానాన్ని చూపుతున్న ఓ అభిమానికి స్వాంకీ బైక్ ను బహుమతిగా ఇవ్వనున్నట్లు సల్మాన్ తెలిపాడు. గతంలో తన చిత్రం 'బాడీగార్డ్' చూసేందుకు అతను తన గ్రామం నుంచి 18 కిలో మీటర్లు నడిచివెళ్లి చూశాడని విన్నాడట. అప్పటినుంచి అతడు తనకు టచ్ లో ఉంటున్నట్లు తెలిపాడు. అందుకే అతనికి బైక్ ఇవ్వాలని అనుకున్నట్లు నిన్న (సోమవారం) ప్రముఖ మోటార్ సైకిల్ కంపెనీ 'సుజుకీ' మార్కెట్ లో ప్రవేశపెట్టిన కొత్త గిక్స్ బైక్ లాంచింగ్ సందర్భంగా విలేకరులకు చెప్పాడు. ఆశ్చర్యంగా ఉంది కదా?