: క్రికెట్ మైదానంలో సినీతారల సందడి
నిత్యం షూటింగులతో బిజీగా వుండే తెలుగు సినీ తారలు బంతి, బ్యాట్ పట్టుకుని క్రికెట్ మైదానంలో కూడా బిజీగా కనిపిస్తున్నారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్ -3) మూడో విడత పోటీలకు మన తారలు సన్నాహకాలు చేస్తున్నారు. తెలుగు వారియర్స్ జట్టు సభ్యులు నిన్నటి నుంచి హైదరాబాదు మాసాబ్ ట్యాంకులోని క్రికెట్ మైదానంలో ప్రాక్టీసు చేస్తున్నారు.
హీరో వెంకటేష్, రామ్ చరణ్, శ్రీకాంత్, తరుణ్ తదితరులు బ్యాట్ పట్టుకుని ఫోర్లు, సిక్సర్లు బాదుతున్నారు. మాజీ క్రికెటర్ చాముండేశ్వరీ నాథ్ వీరికి క్రికెట్లో మెళకువలు నేర్పుతున్నారు. ఈ నెల 9 నుంచి ఈ 'సీసీఎల్ -3' పోటీలు ప్రారంభమవుతుండగా, తెలుగు వారియర్స్ పాల్గొనే మ్యాచ్ 10 న మొదలవుతుంది. ఈసారి మన వారియర్స్ జట్టుకి రామ్ చరణ్ ప్రధాన ఆకర్షణ కానున్నాడు.