: రాజ్యసభ నామినేషన్లకు ముగిసిన గడువు.. మొదలైన ఉత్కంఠ..
ఫిబ్రవరి 7న జరగనున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు గడువు ఈ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. రాష్ట్రం నుంచి మొత్తం 6 స్థానాలకు గానూ 8 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, టీడీపీ నుంచి ఇద్దరు, టీఆర్ఎస్ నుంచి ఒకరు నామినేషన్ వేశారు. ఇద్దరు అభ్యర్థులు ఆదాల, చైతన్య రాజులు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. నామినేషన్ల పర్వం ముగియడంతో... అసలైన టెన్షన్ మొదలైంది. నామినేషన్ వేసిన 8మందిలో... ఓడిపోయే ఇద్దరు అభ్యర్థులు ఎవరా అన్న ఉత్కంఠ ప్రారంభమైంది.