: మహిళల మూడో టీ20లో భారత్ ఓటమి.. సిరీస్ శ్రీలంక వశం
మహిళల క్రికెట్ లో వన్డేల్లో ఓటమి భారంతో ఉన్న శ్రీలంక జట్టుకు ఊరట లభించింది. మూడు టీ20ల సిరీస్ ను 2-1 తేడాతో భారత జట్టును ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది. కీలకమైన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు పూనమ్ రౌత్(38), జులన్ గోస్వామి(37)లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన సిరివర్ధనే(46) పోరాటపటిమతో శ్రీలంక మహిళల జట్టు టీ20 సిరీస్ ను గెలుచుకుంది.