: వికలాంగులను పెళ్లాడితే 50వేలు
రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులను పెళ్లాడే వారికి మరింత ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఇంతవరకూ 10వేలుగా ఉన్న ఈ ఆర్థిక సాయాన్ని ఇక మీదట 50వేలకు పెంచుతూ ఆర్థిక మంత్రి శాసనసభలో ప్రకటన చేశారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వారు వికలాంగులను పెళ్లాడేందుకు ఈ పథకం మరింత దోహదం చేయబోతుంది. మొత్తంగా ఈ ఏడాది బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమానికి సర్కారు 73 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేసింది.