: పాపికొండలుకు వెళ్తూ కొండను ఢీకొన్న బస్సు.. 40 మందికి గాయాలు
ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద బస్సు ప్రమాదం సంభవించింది. పాపికొండలను సందర్శించేందుకు 40 మంది పర్యాటకులతో బెంగళూరు నుంచి వెళ్తున్న బస్సు అదుపు తప్పి కొండను ఢీ కొంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను వీఆర్ పురం మండలం రేఖపల్లి ఆరోగ్యకేంద్రానికి తరలించారు. వీరు నాలుగు రోజుల క్రితం బెంగళూరు నుంచి బయల్దేరారు. వివిధ ప్రదేశాలు చూస్తూ వస్తున్న వీరు దురదృష్టవశాత్తు ప్రమాదం బారిన పడ్డారు.