: కొత్త లోకం.. శాంసంగ్ గెలాక్సీ గ్లాస్
గూగుల్ గ్లాస్ కు పోటీగా శాంసంగ్ గెలాక్సీ గ్లాస్ వచ్చేస్తోంది. ఈ గ్లాస్ ను కళ్లకు ధరించి ఇంటర్నెట్ చూసుకోవచ్చు. ఇందుకు కుడి కన్ను అద్దంలోపల వేలంత స్క్రీన్ ఉంటుంది. కమ్మని సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. లేదా మీ స్మార్ట్ ఫోన్ తోనూ కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని కొరియా టైమ్స్ వెల్లడించింది. వచ్చే సెప్టెంబర్ లో బెర్లిన్ లో జరగనున్న ఐఎఫ్ఏ వాణిజ్య ప్రదర్శనలో శాంసంగ్ ఈ గెలాక్సీ గ్లాస్ ను ప్రదర్శించనుందని సదరు ప్రతిక పేర్కొంది.