: అత్యాచార నిరోధక చట్టంపై కుదరని ఏకాభిప్రాయం
అత్యాచార నిరోధక చట్టంపై అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. వయసు పరిమితిని 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించడం, లైంగిక వేధింపుల కేసులలో కఠిన శిక్షలు... తదితర కొన్ని అంశాలపై పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. దీంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీ ఏకాభిప్రాయానికి రాలేకపోయింది.
ఏవైనా అభ్యంతరాలుంటే తర్వాత సవరించుకోవచ్చని, ప్రస్తుతం ఈ బిల్లు సత్వర ఆమోదానికి సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ పార్టీలు ప్రస్తుత రూపంలో బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అత్యాచార నిరోధక చట్టం విషయంలో మధ్యాహ్నం మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తున్నామని కమల్ నాథ్ చెప్పారు.