: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సంజయ్ సింగ్, సెల్జా
కాంగ్రెస్ పార్టీలో యువరాజు తనకు నమ్మకమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. తనకు అనుకూలంగా ఉండే నేతలను భవిష్యత్ అవసరాల కోసం ఉభయ సభల్లో కొలువు తీరుస్తున్నారు. అందులో భాగంగా మరో ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. హర్యానా నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా కేంద్ర మంత్రి కుమారి సెల్జాను, అసోం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ సంజయ్ సింగ్ పేర్లను ప్రకటించింది.