: మూడున్నర కోట్లను టాయిలెట్ లో వేసేసిన బామ్మ


అక్షరాలా మూడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలను జర్మనీ బామ్మ టాయిలెట్ పాలు చేసింది. ఎందుకో తెలుసా.. బాధ, కోపం! కష్టపడి అదృష్ట దేవత లాటరీ రూపంలో తలుపుతట్టి ఇంట్లో అడుగుపెడితే.. దరిద్రపు పెద్దమ్మ ఆవహించి బామ్మతో ఆ పని చేయించింది. జర్మనీలోని ఎసెన్స్ పట్ణణంలో ఉండే 63 ఏళ్ల ఏంజెలా మేయర్ అనే బామ్మకు ఇటీవలే లాటరీలో రూ. 3.45కోట్లు తగిలింది. కానీ, ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ఒక రోజు ఓ లేఖ బామ్మను వెతుక్కుంటూ వచ్చింది. మరణించే వరకూ ఆమె భర్త కోర్టు సంరక్షణలో ఉన్నారట. ఆయనపై చేసిన వ్యయాన్ని చెల్లించాలంటూ లేఖలో కోర్టు బామ్మను ఆదేశించింది. లేఖను చదివిన ఆమెకు చిర్రెత్తుకొచ్చి ఫుల్ గా షాంపేన్ తాగేసింది. 3.45కోట్ల రూపాయల నోట్లను చించి టాయిలెట్ బేసిన్ లో పడేసి పోయి నిద్రపోయింది.

  • Loading...

More Telugu News