: రాజ్యసభ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేసిన బొత్స
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారయిన టి.సుబ్బరామిరెడ్డి, కేవీపీ, ఎంఎ ఖాన్ లకు గాంధీ భవన్ లో ఏఐసీసీ కార్యదర్శుల సమక్షంలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ బి-ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా ముగ్గురిని అక్కడున్న వారంతా అభినందించారు. రాష్ట్ర కాంగ్రెస్ ఉన్నతికి వివిధ స్థాయుల్లో అందించిన సేవలకు గుర్తింపుగా ఈ ముగ్గురినీ పార్టీ అధిష్ఠానం రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించిందని బొత్స అన్నారు.